హైదరాబాద్: 28°C
వార్తలు

శాస్త్రికి ప్రధాని మోదీ ఘన నివాళి

మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ ఉదయం ఢిల్లీలోని విజయ్ ఘాట్ వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ.. శాస్త్రి సమాధి వద్ద భక్తిశ్రద్ధలతో పుష్పాంజలి ఘటించారు. దేశ భద్రత, రైతుల సంక్షేమం కోసం 'జై జవాన్, జై కిసాన్' నినాదంతో ఆయన చేసిన విశేష సేవలను మోదీ ఈ సందర్భంగా స్మరించుకున్నారు.