హైదరాబాద్: 28°C
వార్తలు

లద్దాఖ్‌లో 28 ప్రాంతాలకు ప్రామాణిక పేర్లు

కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్‌లో 28 ప్రాంతాలను సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్‌‌లో ప్రామాణిక పేర్లతో గుర్తించింది. కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌ అధికారులతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజల్లో ఆయా ప్రాంతాలపై మెరుగైన అవగాహన కల్పించడానికి, వాటి కచ్చితమైన గుర్తింపు కోసమే మ్యాప్‌లో అధికారికంగా పొందుపరిచినట్లు హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.