హైదరాబాద్: 28°C
వార్తలు

‘అయ్యప్పలకు నీటి కష్టాలు రాకుండా చూడండి’

మకరవిలక్కు పూజల నేపథ్యంలో శబరిమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వారికి నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కేరళ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నీటి సరఫరా వ్యవస్థలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. ఎక్కడైనా మరమ్మతులు అవసరమైతే వెంటనే పూర్తి చేసి, భక్తులకు తాగునీటి కష్టాలు రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించింది.