హైదరాబాద్: 28°C
వార్తలు

శబరిమల ప్రసాదంపై హైకోర్టు ఆదేశాలు

శబరిమల అయ్యప్ప ప్రసాదం తయారీ సరకుల నాణ్యత, సేకరణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ట్రావెన్‌కోర్‌ బోర్డును కేరళ హైకోర్టు ఆదేశించింది. 2021 నాటి హలాల్ బెల్లం వివాదం పిటిషన్‌ను విచారించిన కోర్టు.. మహారాష్ట్ర సంస్థ సరఫరా చేసిన బెల్లం నాణ్యమైనదేనని నివేదికల ద్వారా స్పష్టం చేసింది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా సరకుల సేకరణలో బోర్డు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.