హైదరాబాద్: 28°C
వార్తలు

'జై జవాన్, జై కిసాన్'.. శాస్త్రికి దేశం సెల్యూట్

'జై జవాన్.. జై కిసాన్' నినాదంతో దేశాన్ని ఏకతాటిపై నడిపించిన భారత ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి నేడు. 1965 యుద్ధంలో పాకిస్థాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి, భారత సైన్యం సత్తాను ప్రపంచానికి చాటిన సిసలైన దేశభక్తుడాయన. నిరాడంబరత, నిజాయితీ, అచంచలమైన దేశభక్తికి మారుపేరైన శాస్త్రి జీవితం ప్రతి భారతీయుడికీ ఆదర్శం. ఈ మహనీయుడికి ఘనంగా నివాళులర్పిద్దాం.