హైదరాబాద్: 28°C
వార్తలు

గాంధీ జయంతి.. చీపురు పట్టిన కేంద్రమంత్రి

గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా(జేపీ నడ్డా) న్యూఢిల్లీలో శ్రమదాన్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. కర్తవ్య భవన్-1 సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన స్వయంగా పరిసరాలను శుభ్రం చేశారు. మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పిస్తూ, స్వచ్ఛ భారత్ ఆవశ్యకతను, స్ఫూర్తిని చాటుతూ కేంద్రమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.