మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో AIMIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడం తమకు ఏమాత్రం ఇష్టం లేదని తేల్చి చెప్పారు. యూపీలో బీజేపీని గద్దె దించేందుకు ప్రతిపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఓవైసీ తాజా ప్రకటన యూపీ రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది.
వార్తలు
‘బీజేపీని ఓడించేందుకు పొత్తులకు మేం సిద్ధం’


