ప్రజా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం దేశ రాజధాని నగరం న్యూఢిల్లీ జిల్లాలో సెక్షన్ 163 BNSS అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఐదుగురికంటే ఎక్కువ మంది గుమిగూడటం, సభలు, ధర్నాలు, నినాదాలు చేయడం, ఆయుధాలు, లాఠీలు తీసుకెళ్లడం నిషేధించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 223 BNS కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వార్తలు
ఐదుగురికి మించి గుమిగూడితే కఠిన చర్యలు


