హైదరాబాద్: 28°C
వార్తలు

‘ఇంధన విక్రయాలపై ఆంక్షలు వద్దు!’

పెట్రోల్, డీజిల్ విక్రయాలపై పరిమితులు విధించరాదని ప్రైవేట్ సంస్థలకు కేంద్రం సూచించనుంది. బల్క్, రిటైల్ ధరల మధ్య భారీ వ్యత్యాసంతో పారిశ్రామిక అవసరాలకు బంకుల్లో ఇంధనం కొంటున్నారు. దీంతో జియో-బీపీ 50 లీటర్లు, నయారా 200 లీటర్ల వరకు పరిమితి విధించాయి. ఈ ఆంక్షలు ఆమోదయోగ్యం కాదని, అమ్మకాలపై లిమిట్స్ ఎవరికీ అనుమతించబోమని చమురు కార్యదర్శి నీరజ్ మిత్తల్ స్పష్టం చేశారు.