దేశవ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గత నెలలో ఏకంగా రూ.2.03 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్లలో 14.7 శాతం మేర భారీ వృద్ధి నమోదైంది. పండుగ సీజన్ నేపథ్యంలో కొనుగోళ్లు పెరగడంతో ఈ స్థాయి వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.
వార్తలు
14.7 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు


