ATP: అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్స్ డైరెక్టర్ దాశరథి రవీంద్ర తెలిపారు. యూజీసీ నెట్, యూజీసీ సీఎస్‌ఐఆర్ నెట్, గేట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 16లోపు దరఖాస్తు చేయాలని సూచించారు. వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.
వార్తలు
SKU లో Phd ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం


