TG: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలను గుర్తించాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. కరువు మండలాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. కేవలం వర్షపాతం లోటు మాత్రమే కాకుండా ఎస్పీఐ, నేల తేమ, భూగర్భ జలాలు, పశుగ్రాసం వంటి బహుళ సూచికలను పరిగణలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని నిర్ధారించాలని మంత్రి సూచించారు.
వార్తలు
కరువు మండలాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: మంత్రి


