హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు మద్యం, మాంసం షాపులు బంద్

TG: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలపై అధికారులు కఠినమైన ఆంక్షలు విధించారు. రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులు, బార్లు, పబ్‌లు, క్లబ్‌లు పూర్తిగా మూసివేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం దుకాణాలతో పాటు మాంసం విక్రయాలు కూడా పూర్తిగా నిలిచిపోనున్నాయి.