హైదరాబాద్: 28°C
వార్తలు

స్మిత్‌ మచ్చర్‌ కోలుకుంటున్నారు: భారత ఎంబసీ

ఫ్లైదుబాయ్ ఘటనలో తీవ్రంగా గాయపడిన భారత పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆయన కోలుకుంటున్నట్లు యూఏఈలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మచ్చర్‌తోపాటు ఆయన కుటుంబాన్ని స్థానిక భారత రాయబారి దీపక్ మిత్తల్ పరామర్శించినట్లు వెల్లడించింది. వైద్య సేవల విషయంలో స్థానిక అధికారులతో ఎంబసీ సమన్వయం చేసుకుంటోందని పేర్కొంది