చక్కెర ధరలు ఆకాశాన్ని తాకిన నేపథ్యంలో కేంద్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చక్కెర డీలర్లు తమ వద్ద నిల్వలను 15 రోజులకు మించి ఉంచరాదని ఆదేశించింది. అలాగే స్టాక్ హోల్డింగ్ పరిమితిని 1000 క్వింటాళ్లకు పెంచింది. అక్టోబర్ 15వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని చెప్పింది. అలాగే ఈ రూల్స్ నవంబర్ 30కి ముగుస్తాయని తెలిపింది. నిల్వలపై కోల్‌కతా, అసోంకు మినహాయింపు ఇచ్చింది.
వార్తలు
1000 క్వింటాళ్ల చెక్కర నిల్వ చేసుకోవచ్చు: కేంద్రం


