హైదరాబాద్: 28°C
వార్తలు

దివ్యాంగులకు కేంద్రం శుభవార్త

హైవేపై ప్రయాణించే దివ్యాంగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దివ్యాంగుల వాహనాలకు జారీ చేసే మినహాయింపు ఫాస్టాగ్ కాలపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిబంధనలను సవరిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 70 శాతం నుంచి 100 శాతం వరకు వైకల్యం ఉన్న వ్యక్తుల వాహనాలకు ఐదేళ్ల పాటు, 40 శాతం నుంచి 70 శాతం లోపు వారికి మూడేళ్ల పాటు కాలపరిమితితో కూడిన ఫాస్టాగ్ కేటాయిస్తారు.