హైదరాబాద్: 28°C
వార్తలు

మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై రాహుల్ మండిపాటు

మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమని ధ్వజమెత్తారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో నూటికి నూరు శాతం ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా గిరిజనులకు జరుగుతున్న అన్యాయం, వారిని అణచివేస్తున్న తీరుపై పార్లమెంటులో పోరాడుతామని వెల్లడించారు.