హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు విద్యుత్ సరఫరా బంద్

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ రూరల్ మండలంలో అన్ని ప్రాంతాలలో ఈనెల 3న (శనివారం) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని ఈపీడీసీఐఎల్ ఈఈ బివి రమణ తెలిపారు. 33KV లైన్ మెయింటెన్స్ పనుల నిమిత్తం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.