హైదరాబాద్: 28°C
వార్తలు

నటి రన్యారావుకు భారీ షాక్

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావుకు కస్టమ్స్ శాఖ భారీ షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఆమెకు రూ.89 కోట్లు, మరో ముగ్గురికి రూ.155 కోట్ల జరిమానాను విధించింది. 2025లో దుబాయ్ నుంచి బెంగళూరు విమానాశ్రయానికి వచ్చిన ఆమె వద్ద నుంచి 14కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఆమె ఏడాదిలో 113కేజీల బంగారాన్ని అక్రమంగా తరలించినట్లు గుర్తించారు. దీంతో ఆమెకు పెనాల్టీ వేశారు.