హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యావంతులు వాలంటీర్లుగా రావాలి: బ్రదర్‌ షఫీ

వరంగల్‌లో ఏకం భారత్‌ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత ఓటరుగా నమోదు కావడంపై ఆసక్తి చూపకపోవడం విచారకరమని పార్టీ అధ్యక్షుడు బ్రదర్‌ షఫీ, ఉపాధ్యక్షుడు గజేందర్‌ దాస్‌ అన్నారు. నాణ్యమైన ఉచిత విద్య, స్థానికంగా ఐటీ, ఫార్మా ఉద్యోగాల కల్పన తమ లక్ష్యాలని తెలిపారు. విద్యావంతులు వాలంటీర్లుగా ముందుకు రావాలని కోరారు.