హైదరాబాద్: 28°C
వార్తలు

శ‌బ‌రిమ‌లలో హ‌లాల్ బెల్లం వినియోగం.. హైకోర్టు చురకలు

శబరిమల ప్రసాదం తయారీలో హలాల్ సింబల్ కలిగిన బెల్లం వాడకంపై కేరళం హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రసాదం తయారీకి అవసరమైన ముడి సరుకు కొనే ముందు వాటి లేబుల్స్‌ను జాగ్రత్తగా పరిశీలించాలని, అలాగే అప్రమత్తంగా ఉండాలని నిర్వాహకులకు సూచించింది. ప్రసాదం తయారీలో వాడే పదార్థాలు ఎలాంటి సూచికలు, ప్రకటనలు కలిగి ఉండరాదని స్పష్టం చేసింది.