హైదరాబాద్: 28°C
వార్తలు

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు: విజయ్‌

AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్లు టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్‌ తెలిపారు. బీసీలను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమానికి వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. బీసీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, వైసీపీ కుట్ర రాజకీయాలను ఖండించాలని పిలుపునిచ్చారు.