హైదరాబాద్: 28°C
వార్తలు

2008 పేలుళ్ల కేసు.. మరణశిక్షపై సుప్రీం స్టే

2008 నాటి అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో మరణశిక్ష పడిన 38 మంది దోషుల్లో ఒకరైన అహ్మద్ బావా ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. గుజరాత్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 2008 జులై 26న జరిగిన ఈ పేలుళ్లలో 56 మంది మృతి చెందగా, 200 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.