హైదరాబాద్: 28°C
వార్తలు

ట్రాఫిక్ పోలీసుపై కారు డ్రైవర్ దాడి

ముంబై(మహారాష్ట్ర) బీచ్‌ రోడ్‌లో ఓ కారు డ్రైవర్ రెచ్చిపోయాడు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించినందుకు విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసుపైనే దాడికి యత్నించాడు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ పోలీసును కొట్టబోయాడు. అక్కడే ఉన్న ఇతర సిబ్బంది అప్రమత్తమై అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్ జులుంకు సంబంధించిన వీడియో ప్రస్తుతం SMలో వైరల్ అవుతోంది.