హైదరాబాద్: 28°C
వార్తలు

‘కత్తిపోట్లకు గురైనా డోర్ తెరిచాడు’

ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ ప్రశంసించారు. కో-పైలట్ కత్తితో దాడి చేసినా, అతడి వైపు ఉన్న కాక్‌పిట్ డోర్ హ్యాండిల్‌ను తెరిచి మచ్చర్ సాహసం చేశాడన్నారు. ఆ డోర్ తెరవడం వల్లే ప్రయాణికులు, ఇతర పైలట్లు లోపలికి వచ్చి కో-పైలట్‌ను అడ్డుకుని విమానాన్ని సురక్షితంగా వెనక్కి తీసుకురాగలిగారని ఆయన వివరించారు.