హైదరాబాద్: 28°C
వార్తలు

రాజధాని వాసులకు గుడ్ న్యూస్

దేశ రాజధాని నగరం ఢిల్లీ వాసులకు వాయు కాలుష్యం నుంచి కాస్త ఊరట లభించింది. గడిచిన ఐదేళ్ల(2022-2026) రికార్డులతో పోలిస్తే.. సెప్టెంబర్ నెలలో ఢిల్లీలో అత్యల్ప సగటు వాయు నాణ్యతా సూచీ(AQI) నమోదైనట్లు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్(CAQM) వెల్లడించింది. గాలి నాణ్యత మెరుగుపడటంతో అక్షరధామ్, ఎయిమ్స్ తదితర ప్రాంతాల్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.