హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మన్యం అభివృద్ధికి సమన్వయంతో చర్యలు'

PPM: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని అరకు ఎంపీ డాక్టర్ జి. తనూజా రాణి సూచించారు. జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన దిశా సమావేశంలో కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలితో కలిసి వివిధ శాఖల ప్రగతిని సమీక్షించారు.