ASR: జిల్లా జీకే వీధి మండలం పెదవలస పంచాయతీ పరిధిలోని బొంతువలస గ్రామం అభివృద్ధికి దూరంగా ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఇప్పటివరకు సీసీ రోడ్డు,డ్రైనేజీ,వీధి లైట్లు వంటి కనీస సౌకర్యాలు లేవని తెలిపారు. ప్రభుత్వ పథకాల ద్వారా ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదని పేర్కొన్నారు. అధికారులు స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'అభివృద్ధికి దూరంగా బొంతువలస'


