AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్టుమెంట్లు నిండి ఆక్టోపస్ భవనం క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 78,723 మంది భక్తులు దర్శించుకోగా.. 37,664 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారికి రూ.4.63 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
భక్తి
తిరుమల సమాచారం


