హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు పొట్టే పాలెం వంతెన ప్రారంభం

నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని పొట్టే పాలెం కలుజుపై నిర్మించిన వంతెనను అక్టోబర్ రెండవ తేదీ శుక్రవారం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.