PPM: సీతానగరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఇవాళ ముడుపుల పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నట్లు అర్చకులు పీసపాటి శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఇక్కడ స్వామివారికి ముడుపుకట్టి 9 వారాలు 27 ప్రదక్షిణలు చేసి,10వ వారం ప్రసిద్ధి దేవాలయమునకు ముడుపు సమర్పిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
ఆంధ్రప్రదేశ్
భక్తి శ్రద్ధలతో లక్ష్మి నరసింహస్వామి ముడుపుల పూజలు


