TG: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) 21వ సర్వసభ్య సమావేశం HYDలోని ప్రధాన కార్యాలయంలో జరగనుంది. ఈ మేరకు AP, TGలకు బోర్డు లేఖ రాసింది. నీటి పంపిణీ సమస్యలు, త్రిసభ్య కమిటీ పెండింగ్ అంశాలు, టెలిమెట్రీల ఏర్పాటు, బడ్జెట్‌తో పాటు రెండు రాష్ట్రాల ఎజెండాలపై ఇందులో చర్చిస్తారు. ఛైర్మన్, రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఈఎన్సీలు ఈ భేటీకి హాజరుకానున్నారు.
వార్తలు
నేడు కృష్ణా బోర్డు సమావేశం


