హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పర్యావరణ పరిరక్షణలో రీసైక్లింగ్ పాత్ర కీలకం'

E.G: పర్యావరణ పరిరక్షణలో రీసైక్లింగ్ పాత్ర కీలకమని నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. బుధవారం స్వచ్ఛతా హీ సేవా – 2026లో భాగంగా ఆనం కళాకేంద్రంలో సైన్స్, ఆర్ట్ ప్రదర్శనలు నిర్వహించారు. నగరంలోని 50 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. వ్యర్థాల నిర్వహణ, రీయూజ్, రీసైక్లింగ్, ప్లాస్టిక్ నివారణపై విద్యార్థులు ప్రాజెక్టులు రూపొందించారు.