VSP: పరవాడ మండలం పి.భోనంగి సంస్కృతి గ్లోబల్ స్కూల్ ప్లస్-2 విద్యార్థి జె.జయదీప్ జాతీయ స్థాయిలో మెరిశాడు. బుధవారం పుణె ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న 6వ జాతీయ ఫిన్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్‌లో 50 మీటర్ల సర్ఫేస్ విభాగంలో బంగారు పతకం సాధించాడని స్పోర్ట్స్ డైరెక్టర్ జి.మధుబాబు తెలిపారు. కోచ్ హరినాథ్ రెడ్డితో పాటు యాజమాన్యం అభినందించింది.
ఆంధ్రప్రదేశ్
ఫిన్ స్విమ్మింగ్‌లో జయదీప్‌కు స్వర్ణం


