హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హాస్టల్‌ను తనిఖీ చేసిన ఎస్సీ కమిషన్ సభ్యురాలు

SS: లేపాక్షి రాజీవ్ కాలనీ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, హాస్టల్‌ను ఏపీ ఎస్సీ కమిషన్ సభ్యురాలు ఎన్.టి. రామాంజనమ్మ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, భోజనం, తాగునీరు, వసతి, పారిశుద్ధ్యం పరిశీలించారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, విద్యాబోధనపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.