హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవం: బీజేపీ

కోనసీమ: రాహుల్ గాంధీ, ఖర్గే కేంద్ర ఎన్నికల సంఘంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని BJP రాష్ట్ర అధికార ప్రతినిధి నల్ల పవన్ కుమార్ విమర్శించారు. అమలాపురంలో బుధవారం ఆయన మాట్లాడారు. తొలగించిన ఓట్లను తిరిగి చేర్చే ప్రక్రియ చేపట్టినా కాంగ్రెస్ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతోందని విమర్శించారు. దేశంలో BJP ప్రజాస్వామ్య బద్ధంగా పాలన అందిస్తోందని స్పష్టం చేశారు.