హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి చెవిటి పోలమ్మ ఉత్సవాలు

SKLM: జి.సిగడాం మండలం పెంట గ్రామ దేవత చెవిటి పోలమ్మ ఉత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు మక్క విజయలక్ష్మి, నారాయణరావు తెలిపారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని వారు పేర్కొన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులు పాల్గొనాలన్నారు.