SKLM: కవిటి మండలం మాణిక్యపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని సమీర బిసాయి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం ఎం.వైకుంఠరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జావెలిన్ త్రోలో సమీర ప్రథమ స్థానం సాధించింది. అక్టోబరు 2 నుంచి కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఆమె పాల్గొంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి పోటీలకు సమీర ఎంపిక


