హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు మద్యం, మాంసం దుకాణాలు బంద్

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న మద్యం, మాంసం దుకాణాలు మూసివేయాలని పంచాయతీ ఈవో ప్రవీణ్ తెలిపారు. ఈ మేరకు దుకాణాల యజమానులకు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం విక్రయాలు, మాంసం విక్రయాలు నిషేధమని పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే రూ.10 వేలు జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.