హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

షార్ట్ సర్క్యూట్‌తో 2 ఎకరాల అరటి తోట దగ్ధం

KDP: కాశినాయన మండలం సావిశెట్టిపల్లెలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో విజయ్‌కుమార్‌రెడ్డి సాగు చేసిన 2 ఎకరాల అరటి తోట దగ్ధమైంది. మంటలు వేగంగా వ్యాపించడంతో పంట పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినా అప్పటికే తీవ్ర నష్టం జరిగింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరారు.