TG: గ్రామాల్లో ఉపాధి పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ప్రతి గ్రామంలో రోజుకు 100-150 మంది కూలీలకు ఉపాధి కల్పించాలని సూచించారు. 'ప్రతి ఇంటికి ఇంకుడు గుంత.. ప్రతి పొలానికి పంట కుంట.. ప్రతి ఊరికి ఊట కుంట' అనే నినాదంతో నీటి సంరక్షణ పనులను చేపట్టాలని తెలిపారు. 18 ఏళ్లు నిండిన అర్హులందరికీ 15 రోజుల్లో కొత్త జాబ్ కార్డులు మంజూరు చేయాలని ఆదేశించారు.
వార్తలు
15 రోజుల్లో కొత్త జాబ్ కార్డులు: సీతక్క


