హైదరాబాద్: 28°C
వార్తలు

స్థానిక ఎన్నికల పిటిషన్లపై నేడు హైకోర్టు తీర్పు

AP: స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన 5 పిటిషన్లపై హైకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. ఎన్నికలు సమయానికి నిర్వహించాలని, పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనాన్ని సవాలు చేస్తూ, SIR పూర్తయ్యాకే ఎన్నికలు జరపాలంటూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై కోర్టు ఇప్పటికే వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసింది. న్యాయస్థానం తీర్పు వెలువరించాక.. నోటిఫికేషన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.