హైదరాబాద్: 28°C
వార్తలు

ఇద్దరు చిన్నారుల అదృశ్యం కేసు ఛేదన

TG: హైదరాబాద్ కాచిగూడ పరిధిలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం కృష్ణానగర్‌లోని ఇంట్లో నుంచి సునీల్ జాదవ్ (14), లక్ష్మీ జాదవ్ (6) అదృశ్యమయ్యారు. ఇద్దరు చిన్నారుల అదృశ్యంపై ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. 24 గంటల్లో మహారాష్ట్ర నాందేడ్‌లో చిన్నారులను గుర్తించిన పోలీసులు సురక్షితంగా తీసుకువచ్చారు.