హైదరాబాద్: 28°C
వార్తలు

వైద్య విద్య స్థానికతపై సుప్రీంకోర్టు స్పష్టత

AP: వైద్య విద్య స్థానికతపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. తెలంగాణ స్థానికతపై ఇచ్చిన ఆదేశాలే ఏపీ విద్యార్థులకు కూడా వర్తిస్తాయని తెలిపింది. 9వ తరగతి వరకు ఏపీలో చదివిన విద్యార్థిని శ్రీశ్రావ్య, తనకు NEET-UG కౌన్సిలింగ్‌లో ఏపీ స్థానికత వర్తింపజేయాలని సుప్రీంను ఆశ్రయించింది. ఈ రిట్ పిటిషన్‌లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన కోర్టు, ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.