పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఆదేశాల మేరకు దాచేపల్లి(M)లోని ప్రైవేట్ పాఠశాలల బస్సులను సీఐ ఖాజావలి ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. మార్కెట్ యార్డులో నిర్వహించిన తనిఖీల్లో బస్సుల కండిషన్, డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ తదితర పత్రాలను పరిశీలించారు. డ్రైవర్లు వేగ పరిమితులు, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ.. డ్రైవింగ్ చేయాలని సీఐ సూచించారు.
వార్తలు
దాచేపల్లిలో పాఠశాల బస్సులు తనిఖీ


