NGKL: ఊర్కోండ మండల కేంద్రంలో బుధవారం హెడ్ కానిస్టేబుల్ వెంకోజి ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అపరిచితులకు ఓటీపీలు, బ్యాంక్ వివరాలు తెలపవద్దని హెచ్చరించారు. ఆన్‌లైన్ మోసాల బారిన పడితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇందులో పోలీసులు సైదులు, కృష్ణయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
సైబర్ నేరాలపై అవగాహన


