హైదరాబాద్: 28°C
తెలంగాణ

అప్పు అడిగిన వ్యక్తిపై కత్తితో దాడి

PDPL: బేగంపేటలో అప్పు ఇచ్చిన డబ్బులు అడిగిన వ్యక్తిపై దాడి జరిగింది. హోటల్ నిర్వాహకుడు కాసనగొట్టు సాయి నుంచి తాళ్లపల్లి నరేష్ అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని సాయి కోరడంతో కక్ష పెంచుకున్న నరేష్, ఈతచెట్టు గీసే చిన్న ఉలితో సాయిపై దాడి చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గాయపడిన సాయిని రామగిరి పోలీసులు పెద్దపల్లి ఆసుపత్రికి తరలించారు.