హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ ప్రతినిధుల సభను విజయవంతం చేయాలి: MSF

భూపాలపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం MSF జిల్లా ఇన్‌చార్జి మడిపల్లి శ్యామ్ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ విద్యార్థుల చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అక్టోబర్ 6న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే MSF జాతీయ ప్రతినిధుల సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన కళాశాల కమిటీని ఎన్నుకున్నారు.