హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వ ప్రాధాన్యత

KMR: విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వ ప్రాధాన్యత అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ప్రభుత్వ జూనియర్​ కళాశాల రోడ్డు పనులను బుధవారం పరిశీలించారు.15 రోజుల క్రితం కళాశాలకు వచ్చినప్పుడు కళాశాలకు వెళ్లే దారికి రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు రూ.12 లక్షలతో సీసీ రోడ్డు పనులు జరుగుతుండటంతో నేడు పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు.