హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలి’

ములుగు జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన రవి గౌడ్ కోరారు. బుధవారం జరిగిన మున్సిపల్ శాఖ సమావేశంలో పైడిమల్ల గోపికృష్ణ గౌడ్‌ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు.